బ్లాక్‌చైన్ రకాలు

బ్లాక్‌చైన్‌ను నెట్‌వర్క్ కనెక్టివిటీ మరియు అనుమతి అవసరం ఆధారంగా వర్గీకరించవచ్చు.

  • అనుమతి ఆధారిత వివరణ:

    • అనుమతి ఉన్న బ్లాక్‌చైన్ (Permissioned Blockchain)
      • నోడ్స్/సంస్థలకు ముందస్తు అనుమతి మరియు వివిధ పాత్ర బాధ్యతలు బ్లాక్‌చైన్ నిర్వహణాధికారి ద్వారా ఇవ్వబడతాయి.
    • అనుమతి లేని బ్లాక్‌చైన్ (Permissionless Blockchain)
      • ముందస్తు అనుమతి అవసరం లేదు
      • ఎవరైనా జాయిన్ కావచ్చు
  • నెట్‌వర్క్ కనెక్టివిటీ పద్ధతి:

    • పంపిణీ చేయబడిన బ్లాక్‌చైన్ (Distributed Blockchain)
      • అన్ని నోడ్స్ సమానంగా ఉంటాయి
    • కన్సార్టియం బ్లాక్‌చైన్ (Consortium Blockchain)
      • ఎంపిక చేయబడిన నోడ్‌లు సంస్థకు మాత్రమే సంబంధించి పని చేస్తాయి

పబ్లిక్ బ్లాక్‌చైన్ / Public Blockchains

పబ్లిక్ బ్లాక్‌చైన్‌లో ఎవరికి కూడా అడ్డంకి లేదు. ఎవరైనా దీన్ని ఉపయోగించవచ్చు; వాలిడేటర్‌గా కూడా పని చేయవచ్చు (అంటే, కన్‌సెన్సస్ ప్రోటోకాల్‌లో పాల్గొనవచ్చు).

చాలా సందర్భాల్లో అటువంటి వాలిడేటర్‌లకు ఆర్థిక ప్రోత్తనాలు ఇవ్వబడతాయి. (అయితే, ఇది ప్రూఫ్ ఆఫ్ వర్క్ (PoW) పని చేయాల్సిన అవసరం ఉంటుంది.)



ప్రైవేట్ బ్లాక్‌చైన్ / Private Blockchains

ప్రైవేట్ బ్లాక్‌చైన్‌లో అనుమతి (permission) అవసరం ఉంటుంది. దీనిలో చేరాలంటే ముందుగా నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఆహ్వానం అందబడాలి. తర్వాత సభ్యత్వం, డేటా ధృవీకరణ వంటి పనుల్లో కూడా ఆంక్షలు ఉంటాయి. వివిధ పాత్ర బాధ్యతలు అందిస్తారు.

ఈ రకమైన బ్లాక్‌చైన్ ముఖ్యంగా సంస్థలు మరియు ఇతర సమూహాలకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే, పబ్లిక్ బ్లాక్‌చైన్‌లో అధికారము మొత్తం నెట్‌వర్క్‌కి విస్తరించి ఉంటుంది, ఇది వాణిజ్య సంస్థలకు మంచిది కాదు.

వాణిజ్య సంస్థలు ఖాతా నిక్షేపణ (accounting and record-keeping) సరైన మార్గంలో జరగాలని కోరుకుంటాయి; అదే సమయంలో స్వయంప్రతిపత్తి (autonomy) కూడా కావాలి; మరియు సున్నితమైన డేటా రక్షణ ఉండాలి. అందువల్ల సంస్థలు ప్రైవేట్ బ్లాక్‌చైన్‌ని ఇష్టపడతారు.



కన్సార్టియం బ్లాక్‌చైన్ / Consortium / Federated Blockchains

కన్సార్టియం బ్లాక్‌చైన్ అనేది పాక్షిక వికేంద్రీకరణం కలిగిన బ్లాక్‌చైన్. ఇందులో లావాదేవీలను యాక్సెస్ చేయడానికి, ప్రైవేట్ బ్లాక్‌చైన్‌లా అనుమతి అవసరం ఉంటుంది; కానీ ఈ గొలుసు అనేక సంస్థల నియంత్రణలో ఉంటుంది. డేటాను చదవడానికి మరియు కన్‌సెన్సస్ ప్రోటోకాల్‌ను అమలు చేయడానికి కొన్ని నోడ్స్ మాత్రమే అనుమతించబడతారు.