ఇంటర్నెట్ ప్రోటోకోల్ చిరునామా స్పేస్ & ఆటోనోమస్ సిస్టం నంబర్ (ASN)

ఇంటర్నెట్ అసైన్‌డ్ నంబర్స్ అథారిటీ (IANA) ఇంటర్నెట్ సంఖ్య వనరులు, అంటే ఇంటర్నెట్ ప్రోటోకోల్ చిరునామా స్పేస్ మరియు ఆటోనోమస్ సిస్టం నంబర్‌లను కేటాయించే బాధ్యతను ప్రాంతీయ ఇంటర్నెట్ రిజిస్ట్రీలు (Regional Internet Registry)కు అప్పగిస్తుంది. ప్రస్తుతం ARIN, LACNIC, RIPE NCC, AFRINIC మరియు APNIC అనే 5 ప్రాంతీయ ఇంటర్నెట్ రిజిస్ట్రీలు పని చేస్తున్నాయి.


ప్రాంతీయ ఇంటర్నెట్ రిజిస్ట్రీలు ఇంటర్నెట్ ప్రోటోకోల్ చిరునామా స్పేస్ మరియు ఆటోనోమస్ సిస్టం నంబర్‌లను నేరుగా నిర్వహించవచ్చు లేదా జాతీయ ఇంటర్నెట్ రిజిస్ట్రీ (National Internet Registry)కి ఆ బాధ్యతను అప్పగించవచ్చు.

ఉదాహరణకు, భారతదేశంలో ఇంటర్నెట్ పేర్లకు మరియు సంఖ్యలకు సంబంధించిన ఇండియన్ రిజిస్ట్రీ ఫర్ ఇంటర్నెట్ నేమ్స్ అండ్ నంబర్స్ (Indian Registry for Internet Names and Numbers) https://www.irinn.in సంస్థకు భారతదేశపు రిజిస్ట్రీ బాధ్యత అప్పగించబడింది.



బోర్డర్ గేట్వే ప్రోటోకోల్ రూటింగ్ (Border Gateway Protocol Routing)ను ఉపయోగించే ప్రతి ఆటోనోమస్ సిస్టం (AS)కు ఒక ప్రత్యేక ఆటోనోమస్ సిస్టం సంఖ్య కేటాయించబడుతుంది. ఇది ఇంటర్నెట్‌లో ప్రతి నెట్‌వర్క్‌ను ప్రత్యేకంగా గుర్తించడానికి సహాయపడుతుంది.

ఒక ఆటోనోమస్ సిస్టం అంటే ఇంటర్నెట్‌కు సాధారణంగా ఉన్న, స్పష్టంగా నిర్వచించబడిన రూటింగ్ విధానాన్ని (Routing Policy) ప్రదర్శించే ఒకే నిర్వహణ సంస్థ లేదా ప్రాంతం తరపున ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నెట్‌వర్క్ ఆపరేటర్‌ల నియంత్రణలో ఉన్న ఇంటర్నెట్ ప్రోటోనోకోల్ రూటింగ్ ప్రీఫిక్స్‌ల (IP Routing Prefix) సమితి.