మెర్కెల్ ట్రీ లేదా హాష్ ట్రీ అనేది ఒక వృక్షాకార నిర్మాణం. ఇందులో ప్రతి పత్ర కణం (leaf node) ఒక డేటా బ్లాక్‌కి సంబంధించిన హాష్ విలువతో సూచించబడుతుంది; ప్రతి లీఫ్ కాకుండా ఉన్న నోడ్ కూడా తన పిల్ల నోడ్‌ల హాష్ విలువలతో సూచించబడుతుంది.

మెర్కెల్ ట్రీ అనే నిర్మాణాన్ని రాల్ఫ్ మెర్కెల్ 1979లో పేటెంట్ పొందాడు. అందుకే దీనికి మెర్కెల్ ట్రీ అని పేరొచ్చింది. అతను పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీని కనుగొన్నవారిలో ఒకరు మరియు హాష్ క్రిప్టోగ్రఫీకి ప్రసిద్ధుడు.