హాషింగ్ లేదా హాష్ ఫంక్షన్ అనేది ఏదైనా డేటాను ఒక స్థిర పొడవు గల హెక్ళ్/హెక్ఞా (hexadecimal) సంఖ్యగా మార్చే గణిత విధానం. దీనికి కీలు అవసరం లేదు. ఇన్‌పుట్ డేటా ఎంత పొడవుగా, పెద్దదిగా లేదా వేర్వేరు రకాల్లో ఉన్నా, ఒక అల్గోరిథం మాత్రం ఒకే స్థిర పొడవు గల హాష్ విలువలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

ఈ స్థిర పొడవు గల సంఖ్యను హాష్ విలువ (Hash Value) లేదా మెసేజ్ డిజెస్ట్ (Message Digest) అంటారు. ఒక చిన్న మార్పు కూడా హాష్ విలువను పూర్తిగా మార్చివేస్తుంది. అందువల్ల, హాష్ విలువను డేటా యొక్క వేలిముద్రగా పరిగణించవచ్చు. హాష్ విలువను ఉపయోగించి దానిని సృష్టించిన అసలు డేటాను తిరిగి పొందడం సాధ్యం కాదు. అందువల్ల, ఈ పద్ధతిని ఓన్-వే ఇన్‌క్రిప్షన్ (One Way Encryption) కూడా అంటారు.